హిందీ సూరరై పోట్రుకు మద్రాస్‌ కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

9 Sep, 2021 09:48 IST|Sakshi

Madras High Court Green Signal To Remake Of Soorarai Pottru: సూరరై పోట్రు చిత్రం హిందీ రీమేక్‌కు మద్రాస్‌ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వివరాలు.. కథనాయకుడు సూర్య తన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మించిన చిత్రం సూరరై పోట్రు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించడం తెలిసిందే. ఈ చిత్రాన్ని సూర్య అబున్‌డంటియా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థతో కలిసి హిందీలో రీమేక్‌ చేయాలని నిర్ణయించారు.

అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయరాదని, కెప్టెన్‌ గోపీనాథ్‌ బయోపిక్‌ ఆధారంగా రచించిన సింప్లిఫై పుస్తక హక్కులు తమకు చెందినవి అంటూ సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనికి ప్రతిగా 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ చెన్నై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసింది. వాదనల అనంతరం న్యాయమూర్తి బుధవారం 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు