Madhubala : మేనకగా సీనియర్‌ నటి మధుబాల.. ఆకట్టుకుంటున్న లుక్‌

20 Mar, 2023 15:59 IST|Sakshi

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఏప్రిల్‌ 14న విడుదలకు సిద్ధం​ అవుతుంది. ఈ చిత్రంలో సమంత శ​‍కుంతలగా నటించగా, మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ దుష్యంతుడిగా నటించాడు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో కొన్ని క్యారెక్టర్లను పరిచయం చేస్తూ మేకర్స్‌ పోస్టర్లు వదిలారు. తాజాగా అప్సర మేనక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ మధుబాల కనిపించనుంది.

ఈ మేరకు ఆమె లుక్‌ని రివీల్‌ చేశారు మేకర్స్‌. మేన​క​ కూతురే శకుంతల. అంటే ఈ చిత్రంలో మధుబాల సమంతకు తల్లిగా కనిపించనుంది. ఇప్పటికే ఆమె లుక్‌ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. 
 

మరిన్ని వార్తలు