ఇండియా లాక్‌డౌన్‌.. టైటిల్‌ పోస్టర్‌ విడుదల

22 Jan, 2021 00:24 IST|Sakshi

లాక్‌డౌన్‌ కాన్సెప్ట్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు  ప్రకటించారు బాలీవుడ్‌ దర్శకుడు మధుర్‌ భండార్కర్‌. ‘ఇండియా లాక్‌డౌన్‌’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ఇందులో ప్రతీక్‌ బబ్బర్, శ్వేతాబసు ప్రసాద్, ఆహనా కుమ్రా ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. కోవిడ్‌ వల్ల ఏర్పడ్డ లాక్‌డౌన్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి వంటి అంశాల చుట్టూ ఈ సినిమా తిరగనుందట. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని చిత్రబందం ప్రకటించింది. వచ్చే వారం ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘ఈ కథలో భాగమవ్వడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. మధుర్‌ భండార్కర్‌ డైరెక్షన్‌లో షూటింగ్‌ త్వరగా మొదలవ్వా లని ఉంది’’ అన్నారు శ్వేతా బసు.

మరిన్ని వార్తలు