అది నా సినిమా టైటిల్‌.. ఇచ్చేయ్‌

23 Nov, 2020 15:20 IST|Sakshi

కరణ్‌ జోహార్‌పై మధుర్‌ భండాక్కర్‌ ఆరోపణలు

తన సినిమా టైటిల్‌ వాడుకున్నారని ఆవేదన

ఐఎమ్‌పీఆర్‌కు ఫిర్యాదు చేసిన భండాక్కర్‌

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ మధ్య కాలంలో తరచూ వివాదంలో చిక్కుకుంటున్నారు. దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో బాలీవుడ్‌ నెపోటిజంపై తీవ్ర విమర్శలు నెటకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నెపోటిజానికి కారణం కరణ్‌ జోహార్‌ అని ఆయనపై ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక ఇటీవల గోవాలో జరిగిన షూటింగ్‌లో భాగంగా పేరుకుపోయిన చెత్తను కరణ్‌ ధర్మ ప్రొడక్షన్‌ సిబ్బంది సమీప గ్రామంలో చెత్త విసిరేసి వెళ్లడంపై గోవా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మ ప్రొడక్షన్‌ సిబ్బంది బాధ్యత రహితంగా ప్రవర్తించారని పేర్కొంటూ  ధర్మ ప్రొడక్షన్‌పై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా తాజాగా దర్శకుడు మధుర్ భండార్కర్.. కరణ్‌ తన‌ టైటిల్‌ను వాడుకున్నారని ఐఎమ్‌పీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అంతేగాక దీనిపై ఆయన శనివారం ట్వీట్‌ చేస్తూ.. ‘బాలీవుడ్‌ వైవ్స్’‌ అనే పేరుతో తను సినిమాను రూపొందిస్తున్నానని.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభమైందని చెప్పారు. అయితే ఈ టైటిల్‌ను కరణ్‌ తన వెబ్‌ సిరీస్‌కు వాడుకున్నారని ఆరోపించారు. (చదవండి: కరణ్‌ జోహార్‌ క్షమాపణలు చెప్పాల్సిందే)

‘డియర్‌ కరణ్‌ జోహార్‌ మీరు, అపూర్వ మెహతా బాలీవుడ్‌ వైవ్స్‌ అనే నా సినిమా టైటిల్‌ మీ వెబ్ సిరీస్‌ కోసం అడిగారు. అయితే అప్పటికే నా సినిమా షూటింగ్‌ ప్రారంభం కావడంతో మీకు ఆ టైటిల్‌ ఇచ్చేందుకు నిరాకరించాను. కానీ మీ వెబ్‌ సిరీస్‌కు ‘దిఫ్యాబులస్‌ లైవ్స్‌ ఆఫ్ ‌బాలీవుడ్‌ వైవ్స్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అది నా సినిమా టైటిల్‌. దీనిని మీరు వాడుకోవడం అనైతికం. దయచేసి ఆ టైటిల్‌ను మర్చాలని మిమ్మల్ని వెడుకుంటున్నాను’ అంటూ ఆయన ట్వీట్‌లో‌ పేర్కొన్నారు. అంతేగాక కరణ్‌, అపూర్వ మెహతాలపై ఇండియన్‌ మోషన్‌ పిక్చర్‌ అసోషియేషన్‌కు(ఐఎమ్‌పీఆర్‌)కు కూడా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును పరిశీలించిన ఐఎమ్‌పీఆర్‌ కరణ్‌, మెహతాలకు నోటీజుసులు జారీ చేసి దీనిపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వా‍ల్సిందిగా ఆదేశించింది. ఇంతవరకు కరణ్‌, మెహతాలు దీనిపై స్పందించకపోవడం గమనార్హం. కాగా ప్రముఖ బాలీవుడ్ నటుల‌ భార్యల లైఫ్‌స్టైల్‌ను తెరపై చూపించే నేపథ్యంలో కరణ్‌ ‘ఫ్యాబులస్‌ లైఫ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ వైవ్స్‌’ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. (చదవండి: నలుగురిదీ ఒక్కటే మాట..)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా