ఓ ఊరి ఆత్మకథ

2 Oct, 2023 00:58 IST|Sakshi
శివ కంఠమనేని

శివ కంఠమనేని, క్యాథలిన్‌ గౌడ జంటగా మల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. జి.రాంబాబు యాదవ్‌ సమర్పణలో కేఎస్‌ శంకర్‌ రావు, ఆర్‌. వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్‌ కానుంది.

మల్లి మాట్లాడుతూ– ‘‘ఒక ఊరికి ఆత్మ ఉంటే.. ఆ ఆత్మ తన కథ తానే చెబితే ఎలా ఉంటుంది? అనేది చిత్రకథాంశం’’ అన్నారు. ‘‘మంచి యాక్షన్‌ డ్రామాగా రూపొందిన చిత్రమిది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సురేష్‌ భార్గవ్‌.

మరిన్ని వార్తలు