అందమైన ప్రయాణం

18 Oct, 2020 03:02 IST|Sakshi
మాధురీ దీక్షిత్‌, శ్రీరామ్‌

‘‘మా జీవితంలో మరో అద్భుతమైన ఏడాది ప్రారంభమైన రోజు ఇది (అక్టోబర్‌ 17). నా కలల రాకుమారుడితో ప్రతిరోజూ నా జీవితం కొత్తగా, సాహసోపేతంగా ఉంటోంది. మా ఇద్దరి మనస్తత్వాలు వేరు. అయినప్పటికీ నా జీవితంలో నువ్వు (భర్త శ్రీరామ్‌ నేనేని ఉద్దేశించి) ఉండటాన్ని గొప్పగా అనుకుంటాను. నాకూ నీకూ హ్యాపీ యానివర్సరీ.. రామ్‌’’ అని పెళ్లిరోజు సందర్భంగా మాధురీ దీక్షిత్‌ తన ఫీలింగ్స్‌ని పంచుకున్నారు.

‘‘21 ఏళ్ల క్రితం నా సోల్‌మెట్‌ను కనుగొన్నాను. అప్పటినుండి మా ప్రయాణాన్ని ప్రారంభించాం. ప్రతిరోజూ మాకు కొత్తగా, అందంగా ఉంటుంది. ఇలాగే మా ప్రయాణాన్ని మేమిద్దరం కలిసి ఎంతో ఎడ్వంచరస్‌గా కొనసాగిస్తాం. హ్యాపీ ట్వంటీఫస్ట్‌ యానివర్సరీ’’ అన్నారు శ్రీరామ్‌ నేనే.   కెరీర్‌ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే అమెరికాలో డాక్టర్‌గా చేస్తున్న శ్రీరామ్‌ నేనేను 21 ఏళ్ల క్రితం అక్టోబర్‌ 17న వివాహం చేసుకున్నారు మాధురి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు