Madhuri Dixit: బాలీవుడ్‌ స్టార్‌ ఇంట తీవ్ర విషాదం.. మాధురి తల్లి కన్నుమూత

12 Mar, 2023 12:34 IST|Sakshi

అలనాటి స్టార్‌ హీరోయిన్‌, బాలీవుడ్‌ నటి మాధురి దీక్షిత్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి స్నేహలత (90) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని మాధురీ దీక్షిత్‌, ఆమె భర్త శ్రీరామ్‌ నేనే సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. 'మేము ఎంతగానో ప్రేమించే ఆయి(అమ్మ) ఈ రోజు ఉదయం తనకు ఇష్టమైన వారి మధ్య ఉన్నప్పుడు స్వర్గస్తులయ్యారు' అని రాసుకొచ్చారు. మాధురి తల్లి మరణవార్తపై పలువురు సెలబ్రిటీలు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.

గతేడాది జూన్‌లో తల్లి పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్‌ చేస్తూ ఎమోషనలైంది మాధురి. హ్యాపీ బర్త్‌డే ఆయి. 'ప్రతి అమ్మాయికి తన తల్లే బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటుంటారు. నువ్వు నాకోసం ఎంతో చేశావు. నువ్వు చేసిన త్యాగాలు, నాకు నేర్పిన పాఠాలు.. అవే నాకు పెద్ద బహుమతులు. నువ్వు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా' అని రాసుకొచ్చింది.

మరిన్ని వార్తలు