కథ రొమాంటిక్‌గా ఉందని ఒప్పుకున్నా: మాధురీ

30 Aug, 2020 16:24 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్ తన అద్భుతమైన డాన్స్‌, నటనతో ‘డ్యాన్సింగ్ క్వీన్’ ‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. మాధురీ ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉంటూ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు. 1991లో తాను నటించిన ‘సాజన్’ చిత్రానికి సంబంధించిన ఓ అసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ఆదివారం ఆ సినిమా విడుదలై 29 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా మాధురీ ఆ సినిమాకి షూటింగ్‌ సమయంలో దిగిన ఓ త్రోబ్యాక్‌(పాత)ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. అదే విధంగా ఈ సినిమాలో నటించడానికి గల కారణాలను వెల్లడించారు. ‘‘సాజన్‌’ సినిమా ప్రాజెక్టును స్క్రిప్ట్‌ చదివిన తర్వాత వెంటనే అందులో భాగం కావాలని నిర్ణయించుకున్నాను. సినిమా కథ చాలా రొమాంటిక్‌గా ఉంది. సినిమాలో ఉన్న డైలాగ్‌లు కవితాత్మకంగా ఉ‍న్నాయి. సంగీతం చాలా అద్భుతంగా ఉంది’ అని ఆమె కాప్షన్‌ జత చేశారు. (బిగ్‌బాస్ ఎంట్రీ: కొట్టిపారేసిన న‌టి)

ఈ సినిమాలో సంజయ్ దత్ ఓ అనాథ పాత్రలో నటించారు. హీరో సల్మాన్‌ ఇందులో గొప్పింటికి చెందిన వ్యక్తి పాత్రలో నటించారు. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులుగా కనిపిస్తారు. సంజయ్‌ దత్‌ సాగర్‌ అనే పేరుతో గొప్ప కవిగా ఎదుగుతారు. కవి సాగర్‌కి మాధురీ అభిమాని పాత్రలో నటిస్తారు. మాధురీ సాగర్‌ కవిత్వాన్ని అమితంగా ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఎంట్రీతో ట్రైయాంగిల్‌ ప్రేమ మొదలవుతుంది. ఈ సినిమాకి లారెన్స్ డిసౌజా దర్శకత్వం వహించారు. సాజన్ 1991లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో ఒకటి. ఇందులోని పాటలు.. దేఖా హై పెహ్లి బార్, తుమ్ సే మిల్నే కి తమన్నా హై, బహుత్ ప్యార్ కార్తే హై, తు షాయర్ హై, జియే టు జియే కైస్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నాయి. ఈ పాటలు నేటికి అభిమానుల గుండెల్లో మారుమోగుతున్నాయి. ఇక కరణ్ జోహార్ నిర్మించబోయే నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌తో మాధురి దీక్షిత్ త్వరలో డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌లోకి అడుగుపెట్టనున్నారు. మాధురీ గతంలో నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఓ మరాఠీ డ్రామాను నిర్మించిన విషయం తెలిసిందే. 

#29YearsOfSaajan After reading the script of this film, I instantly decided to be a part of it. The story was romantic, the dialogues were poetic and the music was brilliant! 🎬

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

మరిన్ని వార్తలు