విశాల్‌కు షాక్‌: నష్టాన్ని అతడే భరించాలి

9 Oct, 2020 17:46 IST|Sakshi

ముంబై: నటుడు విశాల్‌, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘యాక్షన్‌’. సుందర్‌ ​సి దర్శకత్వం వహించిన ఈ సినిమాను టైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కించారు. గతేడాది నవంబర్‌లో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తాజాగా యాక్షన్‌ సినిమా వల్ల నష్టపోయిన సినీ నిర్మాతలకు హీరో విశాలే డబ్బులు చెల్లించాలని శుక్రవారం మద్రాస్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణ జరిపింది. నష్టాలను భర్తీ చేసే విధంగా రూ. 8.29 కోట్లకు విశాల్‌ గ్యారెంటీ ఇవ్వాలని విశాల్‌ను న్యాయమూర్తి కోరారు. చదవండి: విశాల్ తండ్రి ఫిట్‌నెస్‌ చూస్తే షాకే!

ముందుగా యాక్షన్‌ సినిమాను తక్కువ బడ్జెట్లో తెరకెక్కించాలని నిర్మాతలు భావించారు. అయితే ఈ సినిమా కనీసం రూ.20 కోట్లు వసూలు చేయకపోతే ఆ నష్టాన్ని తను భరిస్తానని విశాల్‌ నిర్మాతలకు చెప్పడంతో చివరికి రూ.44 కోట్లతో యాక్షన్‌ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడటంతో తమిళనాడులో రూ.7.7 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో రూ. 20 కోట్లు వసూలు చేయడంలో విఫలమవడంతో నష్ట పరిహారాన్ని పూడ్చేందుకు తన తరువాత చిత్రం ‘చక్ర’ను ట్రైడెంట్ బ్యానర్‌పైనే నిర్మిస్తానని విశాల్‌ నిర్మాతలకు మాటిచ్చాడు. చదవండి: బీజేపీలోకి హీరో విశాల్‌?

కానీ ప్రస్తుతం ఈ సినిమాను విశాల్‌ తన సొంత బ్యాన్‌లో నిర్మించారని, చక్ర సినిమాను ఓటీటీలో విడుదల చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ యాక్షన్‌ సినిమా నిర్మాతలు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరిపిన హైకోర్టు యాక్షన్‌ సినిమా వల్ల నష్టపోయిన సినీ నిర్మాతలకు హీరో విశాలే డబ్బులు చెల్లించాలని వ్యాఖ్యానించింది. అలాగే చక్ర సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు అనుమతినిచ్చింది. విశాల్, శ్రద్ధా శ్రీనాథ్,రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: హీరో తండ్రిపై ప్రముఖ కమెడియన్‌ ఫిర్యాదు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా