చిక్కుల్లో ఏఆర్‌ రెహ్మాన్‌.. హైకోర్టు నోటీసులు

11 Sep, 2020 14:23 IST|Sakshi

సాక్షి, చెన్నై : బహుభాషా సంగీత దర్శకుడు, అస్కార్‌ అవార్డు విజేత ఏఆర్‌ రెహ్మాన్‌ చిక్కుల్లో పడ్డారు. పన్ను ఎగవేత కేసులో మద్రాస్‌ హైకోర్టు ఆయనకు నోటీసులు జారీచేసింది. ఆదాయపన్ను శాఖ అధికారులు దాఖలు చేసిన వ్యాజ్యంపై తమకు సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ ప్రకారం.. 2012లో బ్రిటన్‌కు చెందిన టెలికాం అనే ప్రైవేటు కంపెనీతో ఏఆర్‌ రెహ్మాన్‌ ఓ ఒప్పందం కుదుర్చకున్నాడు. దాని విలువ 3.47 కోట్ల రుపాయాలు. అయితే ఈ మొత్తానికి కట్టాల్సిన పన్నును రెహ్మాన్‌ చెల్లించకుండా ఏగవేతకు పాల్పడ్డాడని ఆదాయపన్ను అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తమకు వివరణ ఇవ్వాల్సిందిగా న్యాయస్థానం  ఏఆర్‌ రెహ్మాన్‌ను ఆదేశిస్తూ శుక్రవారం నోటీసులు జారీచేసింది.

మరిన్ని వార్తలు