రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టు సీరియస్‌‌

14 Oct, 2020 14:30 IST|Sakshi

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని తలైవాను కోర్టు హెచ్చరించింది. ఇక వివరాల్లోకి వెళ్తే, చెన్నైలోని కొడంబాకంలోరాఘవేంద్ర కళ్యాణమంటపం పేరిట రజనీకాంత్‌కు ఒక కళ్యాణమండపం ఉంది. అయితే దానికి సంబంధించి రూ. 6.5 లక్షల ఆస్తి పన్ను చెల్లించాలంటూ ఆయనకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నోటీసులు పంపించింది. 

ఈ నోటీసులపై మద్రాస్ హైకోర్టును రజనీకాంత్ ఆశ్రయించారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో మార్చి 24 నుంచి కళ్యాణమండపం మూసి ఉందని... అప్పటి నుంచి కళ్యాణమండపం ద్వారా తమకు ఎలాంటి ఆదాయం రాలేదని ఆయన కోర్టులో పేర్కొన్నారు. అందువల్ల తాను ఆ పన్నును చెల్లించలేనని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ అనిత సుమంత్ రజనీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలో రజనీ తరపు లాయర్ మాట్లాడుతూ కేసును విత్ డ్రా చేసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు.

చదవండి: మీరు లేకపోతే నేను లేను!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు