మద్రాసి క్రైమ్‌ డ్రామా

10 Oct, 2020 01:21 IST|Sakshi
పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంచు మనోజ్‌

సంతోష్, రంగజిను ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘మద్రాసి గ్యాంగ్‌’. మనోజ్‌తో ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన అజయ్‌ ఆండ్రూస్‌ నూతంకి దర్శకత్వంలో పద్మజ ఫిలిమ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై ఎస్‌.ఎన్‌. రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. ‘‘క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కనున్న మా సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 13న ప్రారంభమవుతుంది’’ అన్నారు. ఈ చిత్ర నిర్మాత ఎస్‌.ఎన్‌. రెడ్డి. న టుడు సంపూర్ణేష్‌ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎన్‌.ఎస్‌. ప్రసు, కెమెరా: వి.కె. రామరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆర్‌.వి.వి. సత్యనారాయణ.

మరిన్ని వార్తలు