తొలి ΄పౌరుడు తనే! 

30 Sep, 2023 02:17 IST|Sakshi
అక్సా ఖాన్‌, సమర సింహారెడ్డి

సమర సింహారెడ్డి, అక్సా ఖాన్‌ జంటగా తెలుగు శ్రీను దర్శకత్వంలో ‘మగపులి’ సినిమా ఆరంభమైంది. ‘ఫార్మర్‌ ఈజ్‌ ద ఫస్ట్‌ సిటిజన్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ (రైతే ప్రపంచంలో తొలి ΄పౌరుడు) ఉపశీర్షిక. ఎమ్‌బీడబ్ల్యూడీఏ సమర్పణలో నారాయణ స్వామి నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి రైతు టి. రంగడు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నటుడు సుమన్‌ క్లాప్‌ ఇచ్చారు.

‘‘నిరుద్యోగులు, రైతులు, రాజకీయ నాయకుల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు తెలుగు శ్రీను. ‘‘ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో ఉండటం వల్ల కన్నడలో సినిమాలు చేశాను. ఇప్పుడు మాతృ భాషలో సినిమా చేస్తుండటం హ్యాపీ’’ అన్నారు సమర సింహారెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: భానుప్రసాద్‌. జె, కెమెరా: శివారెడ్డి యస్వీ.

మరిన్ని వార్తలు