Maha Samudram: మీరు చేస్తే నీతి..నేను చేస్తే బూతా: సిద్ధార్థ్‌

23 Sep, 2021 18:25 IST|Sakshi

Maha Samudram Trailer Out: శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహా సముద్రం’. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌  రిలీజ్‌ అయ్యింది.

సముద్రం చాలా గొప్పది..చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది అంటూ సాగే ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 'నవ్వుతూ కనిపిస్తున్నట్లున్నంత మాత్రానా బాగున్నట్లు కాదు', 'మీరు చేస్తే నీతి..నేను చేస్తే బూతా' వంటి డైలాగ్స్‌ హైలెట్‌గా నిలిచాయి. 


ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, జగపతిబాబు, రావు రమేశ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని వార్తలు