Superstar Krishna-Sri Sri: సూపర్ స్టార్‌ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా?

16 Nov, 2022 12:37 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ కృష్ణ.. వెండితెరపై ఆయన పేరు చేరగని ముద్ర. సాహసాలకు, సంచనాలకు ఆయన కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆదిలోనే పాత్రలతో ప్రయోగాలు చేశారు. అప్పటి వరకు ఏ హీరో చేయని సాహసం చేసి జేమ్స్‌బాండ్‌ తరహాలో గుఢాచారి 116 సినిమాతో అద్భుతం చేశాడు. ఇక తొలి తెలుగు కౌబాయ్‌ చిత్రం మోసగాళ్లకు మోసగాడు సినిమాలో రికార్డులు క్రియేట్‌ చేశారు. హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన ఆయన కథ తెలుగు వెండితెరపై ఓ చరిత్రగా నిలిచింది.

చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్‌ స్టార్‌

ఓ హీరోగానే కాదు వ్యక్తిగతంగా మంచి మనుసున్న చాటుకున్న నటుడు. కష్టకాలంలో నిర్మాతలను ఆదుకున్న గొప్ప హీరో. అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు. స్టార్‌ హీరోగా, మంచి మనసు చాటుకున్న వ్యక్తిగా సూపర్‌ స్టార్‌ సువర్ణాక్షరాలతో అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి ఆయన గురించి ప్రముఖ రచయిత, మహాకవి శ్రీశ్రీ గతంలో ఏమన్నారో తెలుసా. అప్పట్లోనే తనదైన రాతలతో కృష్ణ గొప్పతనాన్ని శ్రీశ్రీ చాటిచెప్పారు. ఓ సందర్భంలో కృష్ణ గురించి ప్రస్తావించిన ఓ పాత న్యూస్‌ పేపర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు

‘‘నేను ఒక అక్షరం రాసినా దానికి విలువ కట్టి పారితోషికం ఇచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణ’’ అని శ్రీశ్రీ అన్నారు. 1994లో ఓ ప్రముఖ పత్రికలో ఈ వ్యాఖ్యలు ప్రచురితం అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు కృష్ణ గొప్పతనానికి, వ్యక్తిత్వానికి జోహార్లు చేస్తున్నారు. కాగా గుండెపోటు కారణంగా కృష్ణ మంగళవారం(నవంబర్‌ 15) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఆయన అంతిమ యాత్ర మహప్రస్థానం వరకు సాగనుంది.

మరిన్ని వార్తలు