Mahalakshmi: భర్త జైల్లో ఉంటే ఎంజాయ్‌ చేస్తున్న నటి? భర్తను తనే జైలుకు పంపించిందా?

21 Sep, 2023 16:36 IST|Sakshi

కోలీవుడ్‌లో నటి మహాలక్ష్మి- నిర్మాత రవీందర్‌ చంద్రశేఖరన్‌ జంట వెరీ పాపులర్‌.. వీరిద్దరూ కలిసి ఫోటో దిగినా, వీడియోలు షేర్‌ చేసినా ఇట్టే వైరల్‌ అవుతుంటాయి. ఆదర్శ దంపతులని కొందరు కితాబిస్తే.. డబ్బు కోసమే అతడిని పెళ్లి చేసుకుందని మరికొందరు విమర్శిస్తుంటారు. ఇకపోతే ఇటీవలే చీటింగ్‌ కేసులో రవీందర్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఆయన ఇంకా జైల్లోనే ఉన్నాడు.

భర్త జైల్లో.. భార్య ఫోటోషూట్స్‌తో బిజీలో
ఇటువంటి సమయంలో మహాలక్ష్మి చేసిన పనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భర్త జైల్లో ఉంటే నటి ఫోటోషూట్లతో బిజీగా ఉంది. వరుసగా ఫోటోషూట్స్‌ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటోంది. అంతా మంచే జరుగుతుంది.. నా హృదయం నీకోసమే ఎదురుచూస్తోంది అని వాటికి క్యాప్షన్‌ జోడించింది. క్యాప్షన్‌ బాగానే ఉన్నా మహాలక్ష్మి ఫోటోషూట్‌, అందులో ఆమె సరదాగా చిరునవ్వులు ఒలికించడం చూస్తే ఏదో తేడా కొడుతోందంటున్నారు కొందరు నెటిజన్లు.

పెళ్లికంటే ముందే డీల్‌
నిజంగానే మహాలక్ష్మి డబ్బు కోసమే అతడిని పెళ్లాడి, ఇప్పుడు కావాలనే తనని జైలుకు పంపించిందా? అన్న అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే నటి అభిమానులు మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. వీరు చాలాకాలంగా ప్రేమించుకున్నప్పటికీ పెళ్లి మాత్రం గతేడాదే జరిగిందని.. దానికంటే ముందే ఈ ప్రాజెక్ట్‌ గురించి ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు.

నిర్మాత అరెస్ట్‌.. కారణమేంటంటే..
వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్‌తో కోట్లు సంపాదించవచ్చంటూ చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని నమ్మబలికించాడు రవీందర్‌. అందుకు కావాల్సిన నకిలీ పత్రాలను సిద్ధం చేసి అతడి దగ్గరి నుంచి రూ.15 కోట్లకు పైగా డబ్బు తీసుకున్నాడు. 2020లో సెప్టెంబర్‌ 17న ఈ ఒప్పందం జరిగింది. అయితే డబ్బు ముట్టిన తర్వాత రవీందర్‌ ప్రాజెక్ట్‌ను పక్కన పడేశాడు. పోనీ, తన డబ్బు తిరిగివ్వాలని కోరినప్పటికీ అందుకు సరిగా స్పందించలేదు. దీంతో బాలాజీ చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు రవీందర్‌ను అరెస్ట్‌ చేశారు.

A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official)


A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official)

A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official)


చదవండి: మీరా సూసైడ్‌.. కంటతడి పెట్టిస్తున్న విజయ్‌ ఆంటోని భార్య మాటలు..

మరిన్ని వార్తలు