నవ్వులే నవ్వులు 

14 Aug, 2023 01:04 IST|Sakshi

అభినవ్‌ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్‌ రమేష్, భరత్‌ రెడ్డి కీలక పాత్రల్లో అశోక్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘మహానటులు’. ఏబీఆర్‌ ప్రొడక్షన్స్ అండ్‌ ఏబీఆర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై అనిల్‌ బోధిరెడ్డి, తిరుపతి ఆర్‌. యర్రంరెడ్డి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘నేను ఇప్పటి వరకూ కామెడీ జానర్‌ టచ్‌ చేయలేదు. ‘జాతిరత్నాలు’ సినిమా తరహాలో పూర్తి ఫన్, హిలేరియస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తీసిన మూవీ ‘మహానటులు’. నలుగురు టీమ్‌గా మారి మహానటులు అనే యూట్యూబ్‌ చానల్‌ను ఎలా అభివృద్ధి చేశారు? అనేది ఈ చిత్ర కథ’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధం నరేష్, సంగీతం: మార్కస్‌ ఎం.  

మరిన్ని వార్తలు