ఫిబ్రవరి మొదటి రెండు వారాలు ఆసక్తికర కంటెంట్‌తో వచ్చిన హంట్, అమిగోస్ చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక మహాశిరాత్రి సందర్భంగా ఈ వారం పలు కొత్త చిత్రాలు థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. సమంత శాకుంతలం విడుదల వాయిదా పడటంతో తమిళ స్టార్ హీరో ధనుష్ ద్విభాష చిత్రం సార్‌తో పాటు మరిన్ని చిన్న సినిమాలు థియేటర్లో అలరించబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోకి కూడా పెద్ద సినిమాలు రాబోతున్నాయి. మరి ఈ వారం థియేటర్, ఓటీటీలోకి రాబోయే సినిమాలేవో ఇక్కడ ఓ లుక్కేయండి!
తమిళ స్టార్ హీరో-తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ద్విభాష చిత్రం సార్(తమిళంలో వాతి). సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 17వ థియేటర్లో విడుదల కాబోతోంది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా నటించిన చిత్రం "వినరో భాగ్యము విష్ణు కథ". ఈ చిత్రం ద్వారా మురళీ కిషోర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా జనవరి 18న థియేటర్లలోకి రాబోతోంది.
తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అల వైకుంఠపురం’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో ‘షెహ్‌జాదా’ పేరుతో రూపొందించారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా రోహిత్ ధావన్ ఈ చిత్రాన్ని రీమేక్ చేశాడు. కృతి సనన్ కథానాయిక. తెలుగులో విశేషంగా అలరించిన ఈ సినిమాను హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేసి, విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 17న ఈ చిత్రం హిందీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ వారం ఓటీటీలోకి రాబోయే చిత్రాలివే
ఆహా
డిస్నీ+హాట్‌స్టార్
నెట్‌ఫ్లిక్స్
అమెజాన్ ప్రైమ్ వీడియో
లయన్స్‌గేట్ ప్లే