Super Star Krishna: సూపర్‌ స్టార్‌ కృష్ణకు ఘన నివాళి.. కుటుంబ సభ్యుల కీలక నిర్ణయం!

17 Nov, 2022 15:25 IST|Sakshi

సూపర్‌స్టార్ కృష్ణ విషయంలో కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన గుర్తుగా ఓ మెమెరియల్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారట. ఈ మెమోరియల్‌లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలు, షీల్డ్‌లు, ఇతర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు.

చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు

ఇందుకోసం కృష్ణ ఘాట్ ఏర్పాటు చేసే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. మెమోరియల్‌ను సందర్శించే ప్రజలు కాసేపు అక్కడే గడిపి.. సూపర్ స్టార్ కృష్ణ గురించి పూర్తిగా తెలుసుకునే విధంగా ఉండనుందని అంటున్నారు. పద్మాలయ స్టూడియో వద్ద ఈ మెమోరియల్‌ను నిర్మించాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేయనున్నారని సినీవర్గాల నుంచి సమాచారం. 

చదవండి: కీలక ప్రకటన చేసిన విజయ్‌ దేవరకొండ

మరిన్ని వార్తలు