నువ్వు ఎదుగుతున్న కొద్దీ గ‌ర్వంగా ఉంది

31 Aug, 2020 08:22 IST|Sakshi

నేడు(సోమ‌వారం) సూప‌ర్ స్టార్ మ‌హేశ్ ‌బాబు కొడుకు గౌత‌మ్‌ పుట్టిన‌రోజు. అత‌ను 14వ వ‌సంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సంద‌‌ర్భంగా మ‌హేశ్ నిన్న అర్ధ‌రాత్రి ట్విట‌ర్ ద్వారా త‌న‌యుడికి శుభాకాంక్ష‌లు చెప్పారు. "నువ్వు యువ‌కుడిగా ఎదుగుతున్న‌ కొద్దీ గ‌ర్వంగా ఉంది. డోరేమాన్ నుంచి అపెక్స్ లెజెండ్స్ వ‌ర‌కు నీతో క‌లిసి చేసిన ప్ర‌యాణం ప్ర‌త్యేకమైన‌ది. నీకు బెస్ట్ బ‌ర్త్‌డే విషెస్‌. ల‌వ్ యూ గౌత‌మ్" అని రాసుకొచ్చారు. దీనికి చిన్న‌నాటి గౌత‌మ్‌ను ఎత్తుకున్న ఫొటోతో పాటు, టీనేజ్‌లో అత‌డిని హ‌త్తుకున్న ఫొటోను జోడించారు. (చ‌ద‌వండి: అందరి ముందు నూతన్‌కు ‘ఐ లవ్‌ యూ’)

మ‌రోవైపు మ‌హేశ్ భార్య న‌మ్ర‌త శిరోద్క‌ర్ కూడా త‌న‌యుడికి సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన రోజు విషెస్ తెలిపారు. "వీడు ఈ ప్ర‌పంచంలోకి రావ‌డం మా జీవితాల‌నే మార్చేసింది. తొలిసారిగా మేము త‌ల్లిదండ్రులమ‌య్యామ‌న్న అనుభూతినివ్వ‌డ‌మే కాక సంతోషాల‌ను, అంత‌కు మించిన ప్రేమ‌ను తీసుకొచ్చాడు. ఇప్పుడు అత‌నికి 14 ఏళ్లు. ప్ర‌తి సంవ‌త్స‌రం అత‌డు మాకు ప్రేమ‌ను, ఆనందాన్ని పంచుతూనే ఉన్నాడు. త‌ల్లిదండ్రులుగా మ‌మ్మ‌ల్ని గ‌ర్వ‌ప‌డేలా చేస్తున్నాడు. హ్యాపీ బ‌ర్త్‌డే మై డార్లింగ్ స‌న్‌, ఐ ల‌వ్ యూ సో మ‌చ్" అని ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచారు. దీనికి గౌత‌మ్ పుట్టిన‌ప్ప‌టి ఫొటోల‌ను షేర్ చేశారు. (చ‌ద‌వండి: 'మహేష్‌ ఇంట్లో లేకుంటే ఎక్కడ ఉంటారో తెలుసా’)

Gautam’s entry into this world made our lives change forever ♥️♥️ he brought us happiness and more love in our ‘first time parents’ lives 😘😘😘. Today he’s 14 and each year he has only added more and more of love and happiness making us happy and proud parents !! Happy birthday my darling son... I love you so so much ♥️♥️♥️ @gautamghattamaneni

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా