మహేశ్‌ను తారక్‌ ఫాలో అవుతున్నాడా? లేక తారక్‌ను మహేశ్‌ ఫాలో అవుతున్నాడా

17 Feb, 2023 15:41 IST|Sakshi

మహేష్‌ను తారక్ ఫాలో అవుతున్నాడో, లేక తారక్‌ను మహేష్ ఫాలో అవుతాడో తెలియదు కాని, ఈ ఇద్దరి కెరీర్ టర్న్ తీసుకునే సినిమాలు మాత్రం ఈ ఏడాదే పట్టాలెక్కనున్నాయి. మరో విధంగా చెప్పాలంటే, ఇప్పటి వరకు ఒక లెక్క్, డిసెంబర్ నుంచి మరో లెక్క్. అదేంటిటది డిసెంబర్ నుంచి ఏం జరగబోతోంది అంటారా.. అయితే ఈ స్టోరీ చూడండి.

మహేష్‌ బాబు రాజకుమారుడు మూవీ నుంచి, ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం వరకు, మహేష్ ఫిల్మ్ జర్నీ ఒక లెక్కలో సాగింది. కానీ డిసెంబర్ నుంచి మాత్రం మహేష్ లైఫ్ మారిపోనుంది. పూర్తిగా యాక్షన్ హీరోగా మారిపోవాల్సి వస్తుంది.ఇంతకీ డిసెంబర్ స్టోరీ ఏంటి అంటే, రాజమౌళి మేకింగ్‌లో మహేష్ నటించే , యాక్షన్ అడ్వెంచర్ మూవీ, అదే ఇండియానా జోన్స్ లాంటి సినిమా, డిసెంబర్ నుంచే పట్టాలెక్కనుంది.

తారక్ స్టూడెంట్ నంబర్ వన్ నుంచి, ఇప్పుడు తెరకెక్కే కొరటాల మూవీ వరకు, తెరపై ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించాడు. అయితే డిసెంబర్ నుంచి మాత్రం, తారక్ కూడా పూర్తి యాక్షన్ హీరోగా మారాల్సి ఉంటుంది. తారక్‌ ప్రశాంత్ నీల్ మూవీలో పూర్తిస్థాయి డైనమిక్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీ కూడా డిసెంబర్ నుంచే షూటింగ్ ప్రారంభించుకోనుంది.

మొత్తంగా 2023 డిసెంబర్ ఈ ఇద్దరి హీరోల కెరీర్ చాలా కీలకం. అయితే మహేష్ కంటే ముందే తారక్ నటించే యాక్షన్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకు కారణం ప్రశాంత్ నీల్ ఫాస్ట్ మేకింగ్. ఇక రాజమౌళి సంగతి సరేసరి. మహేష్ తో మూవీని ఎప్పటికి కంప్లీట్ చేసి తీసుకొస్తాడు అనేది ఆయన చేతుల్లో కూడా ఉండదు. 

మరిన్ని వార్తలు