ఆర్‌ఆర్‌ఆర్‌ను మించిన బడ్జెట్‌తో మహేశ్‌ మూవీ.. ఎన్ని కోట్లు అంటే..

30 Mar, 2022 15:52 IST|Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదలైంది. కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఇప్పుడు ఇగ అందరి దృష్టి దర్శకధీరుడు రాజమౌళి తదుపరి సినిమాపైనే పడింది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుతో సినిమాకు ఆయన అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. వీరిద్దరి పాన్‌ఇండియా మూవీపై ఎప్పుడు అఫిషియల్‌ ప్రకటన వస్తుందా అని సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ కళ్లలో వత్తులేసుకొని చూస్తున్నారు. ఇప్పటికే మహేశ్‌తో సోలో హీరో మూవీ తీస్తున్నట్లు ప్రకటించాడు రాజమౌళి. ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్‌పై సోషల్‌ మీడియాలో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. బాహుబలి సిరీస్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మించిన బడ్జెట్‌తో, అంటే దాదాపు 800 కోట్ల రూపాయలతో మహేశ్‌ సినిమా ప్లాన్‌ చేస్తున్నాడట దర్శకధీరుడు. ప్రస్తుతం ఈ రూమర్ టొటల్ ఇండియాను షేక్ చేస్తోంది. 

మహేశ్‌తో మూవీకి రాజమౌళి దగ్గర బేసిక్ స్టోరీ లైన్ ఐడియా ఒకటి ఉంది.అది డెవలప్ చేయడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఫారెస్ట్ అండ్వెచర్ స్టోరీని సెట్ చేశాడని ప్రచారం సాగుతున్నప్పటికీ, జేమ్ బాండ్ రేంజ్ లో ఒక స్టైలిష్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా రాజమౌళి చేస్తున్నాడని సమాచారం. ఏది ఏమైనా ఈ సినిమాపై స్వయంగా రాజమౌళి ఒక ప్రకటన చేసేంతవరకు రూమర్స్ కు బ్రేక్ పడే అవకాశం కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు