Mahesh Babu On Love Story :  'చైతూకి గేమ్‌ చేంజర్‌..ఆమెకు ఎముకలు ఉన్నాయా'? 

26 Sep, 2021 09:16 IST|Sakshi

Mahesh Babu Comments On Love Story Movie: టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ఇప్పుడు 'లవ్ స్టోరీ' మూవీ టాపిక్కే వినిపిస్తోంది.  నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరి’ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. కరోనా సెంకడ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు లవ్‌స్టోరీపై రివ్యూ ఇచ్చారు. 

చదవండి : డిన్నర్‌ పార్టీలో ఎమోషనల్‌ అయిన నాగార్జున

'శేఖర్‌ కమ్ముల చాలా బాగా తెరక్కెకించారు. నాగ చైతన్య నటుడిగా చాలా ఎదిగాడు. అతని ప‌ర్‌ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ సినిమా అతనికి గేమ్‌ చేంజర్‌ అవుతుంది. ఇక సాయిపల్లవి ఎప్పటిలాగే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈమెకు అసలు బోన్స్‌(ఎముకలు) ఉన్నాయా? స్క్రీన్‌పై స్క్రీన్ పై ఎవరూ ఇలా డ్యాన్స్ చేయడం చూడలేదు. ఇక వన్ సీహెచ్ మ్యూజిక్ స్కోర్ సంచలనమే చెప్పాలి. రెహమాన్ సార్ శిష్యుడు అని విన్నాను. రెహ‌మాన్ స‌ర్ గ‌ర్వ‌ప‌డే స‌మ‌యం' ఇది అంటూ లవ్‌స్టోరీ టీంపై మహేశ్‌ ప్రశంసలు కురిపించాడు. 

చదవండి : Love Story Review: ‘లవ్‌స్టోరి’ మూవీ రివ్యూ

మరిన్ని వార్తలు