కేక పుట్టిస్తున్న ‘సూపర్‌ స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌’, ఫ్యాన్స్‌కు పండగే

9 Aug, 2021 07:13 IST|Sakshi

Sarkaru Vaari Paata Birthday Blaster Video: మహేశ్‌ బాబు అభిమానులంతాఎప్పుడేప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సూపర్‌ స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌ వచ్చేసింది. అగష్టు 9 ఆయన పుట్టిన రోజు సందర్భంగా సూపర్‌ స్టార్‌ తన అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను అందించాడు. ఆయన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ నుంచి స్పెషల్‌ వీడియో బయటకు వచ్చింది. మహేశ్‌ బర్త్‌డేని పురస్కరించుకుని ఆగస్టు 9న ‘సూపర్‌స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌’ పేరుతో ఈ వీడియో విడుదల చేశారు మూవీ యూనిట్‌. చెప్పిన టైం కంటే కొన్ని గంటలే ముందే మేకర్స్‌ ఈ వీడియోను విడుదల చేసి అభిమానులకు డబుల్‌ ట్రీట్‌ ఇచ్చారు. మునుపెన్నడూ లేనివిధంగా ఇందులో మహేశ్‌ మరింత యంగ్‌గా‌ కనిపించాడు. ఆయన చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు, కీర్తిసురేశ్‌తో లవ్‌ ట్రాక్‌ ఇలా ప్రతిదీ వావ్‌ అనిపిస్తున్నాయి. 

ఈ స్పెషల్ బ్లాస్టర్ విషయానికి వస్తే.. ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. అంటూ మహేష్ బాబు ఎంట్రీని అద్భుతంగా చూపించారు. ‘ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్’ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ కేక పుట్టించేలా ఉంది. మొదట యాక్షన్ సీన్స్‌తోనే ఈ బ్లాస్టర్‌ను పేల్చేశారు మూవీ యూనిట్‌. ‘ఇఫ్‌ యూ మిస్‌ ది ఇంట్రస్ట్‌ యు విల్‌ గెట్‌ ది డేట్‌’ అంటూ విలన్ గ్యాంగ్‌కి వార్నింగ్ ఇచ్చాడు మహేశ్‌. ఆ తర్వాత హీరోయిన్‌ కీర్తి సూరేశ్‌ మహేశ్‌కు హారతి ఇస్తూ ‘సార్‌ పడుకునే ముందు ప్రతి రోజూ దిష్ఠి తీయడం మాత్రం మర్చిపోకండి’ అని చెప్పగానే, మహేశ్‌ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. 

మరిన్ని వార్తలు