నాకు తెలిసిన బెస్ట్‌ మేకప్‌ మ్యాన్‌ ఇతనే: మహేశ్‌ బాబు

8 Jul, 2021 16:29 IST|Sakshi

పట్టాభి ది బెస్ట్‌ మేకప్‌ మ్యాన్‌ అంటున్నాడు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు. ఈ రోజు మహేశ్‌ బాబు మేకప్‌ మ్యాన్‌ పట్టాభి బర్త్‌డే. ఈ సందర్భంగా మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా అతనికి బర్త్‌డే విషెస్‌ తేలియజేశాడు. ‘నాకు తెలిసిన వారిలో బెస్ట్‌ మేకప్‌ మ్యాన్‌ ఇతను. పుట్టిన రోజు శుభాకాంక్షలు పట్టాభి. ఈ ఏడాది మీకు మరింత అద్భుతంగా ఉండాలి. మీ మీద ఎప్పటికి ప్రేమ, గౌరవం అలాగే ఉంటుంది’అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు. ఆయన ట్వీట్‌ చేసిన వెంటనే మహేశ్‌ అభిమానులు పెద్ద ఎత్తున పట్టాభికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, మహేశ్‌ ప్రస్తుతం పరుశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం మాటల మాంత్రికుడు తివిక్రమ్‌తో ఓ మూవీ చేయబోతున్నాడు.  

మరిన్ని వార్తలు