'దమ్‌ మసాలా' సాంగ్‌కు సితార డ్యాన్స్‌.. మిలియన్లకొద్ది వ్యూస్‌

3 Feb, 2024 08:13 IST|Sakshi

టాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో ఎక్కువగా వినిపించే పేరు ఘట్టమనేని సితార. మహేశ్‌ బాబు కూతురిగానే కాకుండా తనకంటూ ఒక స్టార్‌ ఇమేజ్‌ను కూడా క్రియేట్‌ చేసుకుంది. ఇప్పటికే పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలు, వీడియోలతో పాపులరైన సీతూ పాప.. మహేశ్‌ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఎప్పుడూ స్పెషలే అని చెప్పవచ్చు. నటనతో పాటు పదిమందికి సాయం చేయడంతో తండ్రి వారసత్వాన్ని సితార ముందుకు తీసుకెళ్తుంది.

భవిష్యత్‌లో సితార కూడా సినిమాల్లోకి వస్తుందని నమ్రత ఇప్పటికే పలుమార్లు చెబుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సితార కూడా చదువుతో పాటు క్లాసికల్‌ డ్యాన్స్‌ కూడా నేర్చుకుంది. అప్పుడప్పుడు పలు సూపర్‌ హిట్‌ సాంగ్స్‌కు ఆమె డ్యాన్స్‌ చేస్తూ అభిమానులను మెప్పిస్తూ ఉంటుంది. తాజాగా 'గుంటూరు కారం' సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌కు సితార అద్భుతమైన డ్యాన్స్‌ చేసింది. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

సితారకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు రెండు మిలియన్‌ల ఫాలోవర్లు ఉన్నారు. 'గుంటూరు కారం' సినిమాలోని 'దమ్‌ మసాలా' పాటకి ఆమె దుమ్మురేపే డాన్సు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇందులో సితార డాన్సుకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. గుంటూరు కారంలో హీరోయిన్‌ శ్రీలీలకు ఏ మాత్రం తగ్గకుండ సితార డ్యాన్స్‌ ఉందని కామెంట్లు చేస్తున్నారు.  సీతూ పాప డ్యాన్స్‌ త్రీ డీలో కనిపిస్తుందని ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తున్నారు. సితార అదరగొట్టిన డ్యాన్స్‌ వీడియోకు ఇప్పటి వరకు 50 లక్షల వ్యూస్‌ రావడం విశేషం.

whatsapp channel

మరిన్ని వార్తలు