నాన్న నా కెమెరా నుంచి తప్పించుకోలేవు

1 Dec, 2020 15:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌ ‌బాబు తన పిల్లలతో చాలా సరదాగా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆయన గారాల పట్టి సితార, తనయుడు గౌతమ్‌లతో సరదాగా ఆడుకుంటున్న ఫొటోలను తరచూ మహేశ్‌‌ భార్య నమ్రతా శిరోద్కర్‌ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటారు. ఇక సితారా పాప తన తండ్రి మహేశ్‌‌ బాబు నటించిన చిత్రాల హిట్‌ పాటలకు స్టెప్పులేసిన వీడియోలైతే ఎంతాగానో వైరల్‌ అవుతుంటాయి. ఇక సితారా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో సోమవారం షేర్‌ చేసిన వీడియో నెటిజన్‌లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో మహేశ్ బెడ్‌పై పడుకుని ఉండగా సితార వీడియో తీస్తోంది. అయితే తన కెమెరాకు చిక్కకుండా మహేశ్‌ తలగడతో దాగుడు మూతలు ఆడుతున్నారు. ఈ క్రమంలో సితారా నాన్న నువ్వు తప్పించుకోలేవు అని అంటుండగా మహేశ్‌ తన రెండు చేతులతో ముఖానికి దాచేశారు. ఈ వీడియోను ‘నాన్న నువ్వు నా కెమెరా నుంచి తప్పించుకోలేవు’ అనే క్యాప్షన్‌తో సితార పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో‌ వైరల్‌ అవుతోంది. (చదవండి: 'సర్కారు వారి' ప్లాన్‌ మారిందా?)

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni)

కాగా కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు వాయిదా పడటంతో మహేశ్‌‌ తన కుటుంబంతో సరదాగా గడుపుతున్న ఫొటోలు, వీడియోలు కూడా ఇటీవల తెగ వైరల్‌ అయ్యాయి. అయితే ప్రస్తుతం మహేశ్‌‌ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అన్ని దేశాలు లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో ‘సర్కారి వారి పాట’ షూటింగ్ షెడ్యూల్ ఆమెరికాలో ఉండటంతో మహేష్‌ తన కుటుంబంతో కలిసి అక్కడ వాలిపోయారు. ‘గీత గోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్‌ సరసన కీర్తీ సురేశ్‌ కథానాయికగా నటుస్తుండగా.. బ్యాంక్‌ స్కామ్‌ బ్యాక్‌డ్రాప్‌లో నేపథ్యంలో ‘సర్కారి వారి పాట’ రూపొందనున్నట్లు సమాచారం. (చదవండి: ఇలాంటి క్ష‌ణాలు అమూల్య‌మైన‌వి: న‌మ్ర‌త‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా