నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌

30 Sep, 2020 15:42 IST|Sakshi

సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు గారాల త‌న‌య సితార ఎప్పటిక‌ప్పుడు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తండ్రి న‌టించిన హిట్ సినిమాల్లోని పాట‌ల‌కు స్టెప్పులేసిన వీడియోలైతే ఎంత‌గానో వైర‌ల్ అయ్యాయి. తాజాగా పాట‌లు, డ్యాన్సులకు బ‌దులుగా త‌న గుండెలో క‌ల‌కాలం నిలిచిపోయిన ఓ పాత ఫొటోను షేర్ చేసుకుంది. ఇందులో కుర్చీలో వాలిపోయిన మ‌హేశ్ మెడ చుట్టూ చేతులు వేసి హాయిగా కునుకు తీస్తోంది. (చ‌ద‌వండి: మ‌హేశ్ డబుల్‌ బొనాంజా?)

"సేద తీరేందుకు ఇంత‌క‌న్నా మంచి స్థ‌లం ఎక్క‌డుంటుంది? నాన్నా.. నువ్వే బెస్ట్" అంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. ఇది విమానాశ్ర‌యంలో దిగిన ఫొటో అని తెలుస్తోంది. కాగా సితార తండ్రి పుట్టిన‌రోజున‌ ఓ స్పెష‌ల్ వీడియో త‌యారు చేసి మ‌హేశ్‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన విష‌యం తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి కూతురు ఆద్య‌తో క‌లిసి ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌ను న‌డుపుతోంది. ఇదిలా వుంటే మ‌హేశ్ ప్ర‌స్తుతం 'స‌ర్కారు వారి పాట' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో మ‌హేశ్ డ‌బుల్ యాక్ష‌న్ చేస్తున్నార‌ని టాక్. (చ‌ద‌వండి: తెగ వైరలవుతోన్న మహేష్‌ బాబు ఫోటో)

Nothing better than this resting place !!❤️❤️❤️ My cozy snuggle !! Nana you are the best 😍😍😍😍 #airportdiaries #snuggletime #waybackwednesday

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా