నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు.. మహేశ్‌బాబు ఎమోషనల్‌

8 May, 2022 11:11 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, కీర్తీ సురేష్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురాం​ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో సినిమా ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచిన చిత్రబృందం..  శనివారం (మే 7) హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ తో పాటు కీర్తి సురేష్, పరశురామ్, వీరితో పాటు జీనియస్ డైరెక్టర్ సుకుమార్, వంశీ పైడి పల్లి కూడా సందడి చేశారు.

(చదవండి: రిపీట్‌ ఆడియన్స్‌ ఉంటారు.. రాసి పెట్టుకోండి)

ఈ సందర్భంగా మహేశ్‌ బాబు తన అన్నయ్య రమేశ్‌బాబుని తలచుకొని ఎమోషనల్‌ అయ్యాడు. ఈ రెండేళ్లలో చాలా జరిగాయి. చాలా మారాయి. నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు ( కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు అన్నయ్య రమేశ్‌ బాబు అనారోగ్యంతో ఈ ఏడాది జనవరి 8న మృతి చెందారు. ఆ సమయంలో మహేశ్‌బాబు కరోనా బారిన పడడంతో చివరి చూపు కూడా నోచుకోలేదు). కానీ ఏది జరిగినా, ఏది మారినా మీ (ఫ్యాన్స్‌) అభిమానం మాత్రం మారలేదు.. అలానే ఉంది. ఇది చాలు ధైర్యంగా ముందుకెళ్లి పోవడానికి..’ అంటూ మహేశ్‌బాబు ఎమోషనల్‌ అయ్యారు.

మరిన్ని వార్తలు