అమ్మ చేతి కాఫీ.. దేవుడి ప్రసాదంతో సమానం: మహేశ్‌ ఎమోషనల్‌, పాత వీడియోవైరల్‌

28 Sep, 2022 11:51 IST|Sakshi

‘ఎంతమందికి తెలుసో..తెలియదు కాని ఏప్రిల్‌ 20న మా అమ్మ ఇందిరమ్మగారి పుట్టిన రోజు. అమ్మ ఆశిస్సులు, దీవెనలకు మించిదేది ఉండదు. ఆ రోజున నా సినిమా విడుదల కావడం నిజంగా సంతోషంగా ఉంది. అమ్మగారి ఆశిస్సులు నాకు చాలా ముఖ్యమైనవి’.. ఇవి ‘భరత్‌ అనే నేను’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో తన తల్లి గురించి మాట్లాడిన మాటలు. మహేశ్ బాబుకు తన మాతృమూర్తి తో ఎంతో అనుబంధం ఉంది. అమ్మ పట్ల తనకున్న ఇష్టాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా అభిమానులతో పంచుకునేవాడు.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మహర్షి సినిమా సక్సెస్‌ మీట్‌లో కూడా తల్లి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ‘నాకు అమ్మంటే నాకు దేవుడితో సమానం. సినిమా విడుదలకు ముందు అమ్మదగ్గరకు వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగినే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్లు ఉంటుంది. ఆమె ఆశీస్సులు నాకెప్పటికీ ముఖ్యం’అని మహేశ్‌ అన్నారు. బుధవారం(సెప్టెంబర్‌ 28)తెల్లవారు జామున ఇందిరాదేవి మరణంతో గతంలో తల్లి గురించి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మాతృమూర్తి పట్లకు మహేశ్‌కు ఉన్న ప్రేమను గుర్తు చేసుకుంటూ సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ ఆ వీడియోలను షేర్‌ చేస్తూ..‘ధైర్యంగా ఉండండి అన్నా’అంటూ కామెంట్‌ చేస్తున్నారు. మహేశ్‌ నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలోని తల్లి సెంటిమెంట్‌ సీన్‌ను కూడా షేర్‌ చేస్తున్నారు. 

చదవండి:
సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం
ఒకే ఏడాది రెండు విషాదాలు..తీవ్ర దుఃఖంలో మహేశ్‌
 తల్లి మృతితో శోకసంద్రంలో మహేశ్‌బాబు

మరిన్ని వార్తలు