మరోసారి తమిళదర్శకుడితో మహేష్‌బాబు!

5 Aug, 2020 08:55 IST|Sakshi

ప్రిన్స్‌ మహేష్ బాబు సినిమాల విషయంలో అంతగా ప్రయోగాలు చేయడు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే  గతంలో చేసిన ప్రయోగాలు దెబ్బ కొట్టడంతో  ఆయన చాలా వరకు సేఫ్ జోన్ లోనే సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.  ప్రస్తుతం మహేష్‌బాబు పరశురామ్ దర్శకత్వంలో కమర్షియల్ ఫార్మాట్ లో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ మహేష్‌ సరసన నటించనుంది. 

మహేష్ బాబు దర్శకులను ఎంతగానో నమ్ముతాడు. డైరెక్టర్‌లు ఏది చెబితే అది చేస్తాను అని మహేష్‌ చాలా సందర్భాలలో చెప్పారు.  తమిళ దర్శకుడు మురగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు స్పైడర్‌ అనే భారీ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య విలన్‌గా నటించారు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్‌ అయిన ఈ చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్‌ కాలేక బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. అయితే మహేష్‌ బాబు ఇ‍ప్పుడు మరో తమిళ దర్శకుడు లోకేష్‌ కనగరాజుతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ వార్త  నిజమైతే తన అభిరుచికి  తగినట్టుగా కాకుండా ప్రేక్షకులకు నచ్చే కథలనే ఎంచుకొని సినిమాలను చేస్తానని చెప్పిన మహేష్‌బాబు ఈసారి ఎలాంటి కథను ఎంచుకోబోతున్నారో తెలియాల్సి ఉంది.

చదవండి: ‘రాజకుమారుడు’కి 21 ఏళ్లు.. మహేష్‌ ట్వీట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు