ఆకట్టుకుంటున్న మహేశ్‌ మేనల్లుడి ‘హీరో’ టీజర్‌

23 Jun, 2021 20:18 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు మేనల్లుడు, ఎంపీ జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా ఓ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీకి హీరో అనే టైటిల్‌ ఖారారు చేసింది చిత్ర బృందం. తాజాగా ‘హీరో’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌ను సూపర్‌ స్టార్‌ మహేశ్‌ విడుదల చేశాడు. అంతేగాక తన మేనల్లుడు ఆశోక్‌ గల్లా, మూవీ యూనిట్‌కు అభినందనలు కూడా తెలిపాడు. 

ఇక టీజర్‌ విషయానికి వస్తే.. ట్రైన్‌ వెళ్తుండగా కౌబాయ్‌ గేటప్‌లో అశోక్ గల్లా ఎంట్రీ ఇస్తాడు. గుర్రంపై ఆ ట్రైన్‌ను ఫాలో అవుతూ ఇచ్చిన అశోక్‌ ఎంట్రీ టీజర్‌కు హైలెట్‌గా చెప్పుకోవచ్చు. అంతేగాక హీరో జోకర్‌ గేటప్‌లో సైకోగా కనిపించగా మరోచోట రోమియోగా దర్శనం ఇచ్చాడు. టీజర్‌ మొత్తంలో అశోక్‌ మూడు పాత్రల్లో కనిపించడం మరింత ఆసక్తిని పెంచుతుంది. కాగా అమరరాజ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు