Mishan Impossible: యాభై లక్షలు ఇస్తారంట్రా? 

16 Mar, 2022 07:45 IST|Sakshi

‘అరెస్ట్‌.. ఇన్‌ఫ్లుయెన్స్‌.. బెయిల్‌.. ఈ సైకిల్‌ బాగా అలవాటు వీడికి’ అంటూ తాప్సీ చెప్పే డైలాగ్‌తో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ ట్రైలర్‌ విడుదలయింది. తాప్సీ లీడ్‌ రోల్‌ చేసిన చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె దర్శకత్వంలో నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్‌ 1న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు విడుదల చేసి, యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

‘దావూద్‌ ఇబ్రహీంని పట్టుకుంటే యాభై లక్షలు ఇస్తారంట్రా, యాభై లక్షలంటే ఎంత డబ్బులు?, చాలా డబ్బులు రా.. ఇవే డబ్బులు రాజమౌళికి ఇస్తే ‘బాహుబలి’పార్ట్‌ 3 తీస్తాడు..’ అంటూ ముగ్గురు బాలనటులు చెప్పే డైలాగులు ట్రైలర్‌లో ఉన్నాయి. ‘‘యాక్షన్, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ఇందులో ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ పాత్రలో తాప్సీ నటించారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

మరిన్ని వార్తలు