ఇది పదో సారి.. అయినా ‘మహర్షి’ దూకుడు తగ్గట్లేదుగా!

19 Jun, 2021 17:23 IST|Sakshi

సందేశాత్మక చిత్రాలను ఎంపిక  చేయడంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎ​​ప్పుడూ ముందుంటాడు. ఈ తరహాలో మహేశ్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం 'మహర్షి'. ఈ సినిమా కలెక్షనన్లు కొల్లగొట్టి మహేశ్‌ కెరీర్‌లో మరో బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. థియేటర్లో ఊపు ఊపిన ‘మహర్షి’ టీవీలో మాత్రం మొదట్లో టెలికాస్ట్ చేసినప్పుడు ఊహించిన స్థాయి టీఆర్పీ రేటింగ్ రాలేదు, కానీ మెల్లమెల్లగా ఊపందుకుంది. అలా ఇప్పుడు పదోసారి టెలీకాస్ట్ కాగా అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వచ్చింది.

తొమ్మిది సార్లు ఈ చిత్రం మంచి టీఆర్పీ సాధించగా, పదోసారి 7.80 రేటింగ్స్‌తో సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా మహేశ్‌ సినిమాలకు ఒక సినిమా పదోసారి కూడా టీవీలో ప్రసారం అయ్యి ఈ రేంజ్‌లో టీఆర్పీను తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదంటున్నారు. ఇన్ని సార్లు టెలికాస్ట్ అయిన తర్వాత కూడా మళ్లీ అంత మంది చూడటమే కాకుండా మునపటి కంటే ఎక్కువ మందే ఈ సారి వీక్షించడం ఇదొక అరుదైన ఘటననే చెప్పాలి. అయితే మహర్షి సినిమాకు ఆ స్టామినా ఉందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇది వరకు మన రాకుమారుడు నటించిన ‘అతడు’ చిత్రం కూడా ఇదే తరహాలో మొదట మెల్లగా ప్రారంభమై, తర్వాత టీవీ ప్రేక్షకులను కట్టిపడేసిన సంగతి తెలిసిందే. 

1st Time: 9.3
2nd time : 7.3
3rd Time: 6.13
4th time: 9.02
5th Time: 10.28
6th Time: 8.82
7th Time: 7.14
8th Time: 5.14
9th Time: 4.92
10th Time: 7.80**

చదవండి: అప్పట్లో షారుక్‌ ఇచ్చింది ఇంకా నా పర్సులోనే ఉంది: ప్రియమణి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు