ముగిసిన ఇందిరాదేవి అంత్యక్రియలు

28 Sep, 2022 14:27 IST|Sakshi

సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి అంత్యక్రియలు ముగిశాయి. పద్మాలయ స్టూడియో నుంచి జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో మహేష్ బాబు తల్లి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తమ అభిమాన హీరో తల్లిని కడసారి చూడడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. పలువురు సినీ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొని తుది వీడ్కోలు పలికారు. ఇందిరాదేవి  పార్థివ దేహాన్ని చూసి కృష్ణ, మహేశ్‌ బాబు  చలించిపోయారు. ఇద్దరూ కన్నీంటి పర్యంతమయ్యారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి.. బుధవారం ఉదయం కన్నుమూశారు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న  ఇందిరాదేవి బుధవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, ప్రముఖుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోలోకి తరలించారు. అనంతరం మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. ఈ కార్యక్రమానికి మీడియాకు అనుమతి ఇవ్వలేదు.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు