నా లైఫ్‌లైన్‌ రా నువ్వు..

19 Sep, 2020 18:48 IST|Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ ‘వెన్నెల’ కిషోర్‌ పుట్టినరోజు నేడు. నేటితో ఆయన 40వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా సెలబ్రిటీలతో పాటు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్లకాలం ఇలాగే నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు విష్‌ చేయగా.. ‘‘హ్యాపీ బర్త్‌డే కాకా’’ అంటూ సుధీర్‌ బాబు ఓ పాత వీడియోను షేర్‌ చేశారు. సముద్రంలో పడవప్రయాణం చేస్తున్న దృశ్యాలను షేర్ చేస్తూ, ‘‘ఇలాంటి సాహసాలు మరెన్నో చేద్దాం, నీ భయాలన్నింటినీ పటాపంచలు చేద్దాం’’ అంటూ ఆట పట్టించాడు. ఇక సుశాంత్..‌ ‘‘హ్యాపీ బర్త్‌డే బోస్’’‌ అంటూ కిషోర్‌తో కలిసి ఉన్న పాత ఫొటోను చేశాడు. (చదవండి: అలియాస్ వెన్నెల కిషోర్ కూడా ఆ కోవలోని వాడే!)

అదే విధంగా అడవి శేష్‌.. ‘‘ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి రా. నాకు మంచి స్నేహితుడిగా, ఓ సోదరుడిగా, సలహాదారుగా ఎంతో ప్రియమైన వాడివి. నేను ప్రతిరోజూ నవ్వుతున్నానంటే అందుకు నీ జోకులే కారణం. లైఫ్‌లైన్‌ రా నువ్వు’’అంటూ మస్కటీర్స్‌ షో(పాపులర్‌ అమెరికన్‌ షో)ను గుర్తుచేస్తూ కిషోర్‌తో తన అనుబంధం గురించి రాసుకొచ్చాడు. వీళ్లతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్‌,  అనసూయ భరద్వాజ్‌, మంచు మనోజ్‌, లావణ్య త్రిపాఠి, శ్రీనివాస్‌రెడ్డి, గోపీచంద్‌ మలినేని, రవితేజ, అనిల్‌ రావిపూడి తదితర సెలబ్రిటీలు వెన్నెల కిషోర్‌ను విష్‌ చేశారు. కాగా 2005లో వెన్నెల సినిమాతో వెండితెరకు పరిచయైన కిషోర్‌ కుమార్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ కమెడియన్‌గా వెలుగొందుతున్నాడు. దాదాపు అందరు హీరోలతోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న కిషోర్‌, తనదైన శైలిలో హాస్యం పండిస్తూ లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా