ఆ హీరోయిన్స్‌ వద్దు.. జక్కన్నకి మహేశ్‌ బాబు మెలిక

23 Jun, 2022 16:57 IST|Sakshi

‘సర్కారు వారి పాట’చిత్రంతో మరో సూపర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు. ఇక ఇప్పుడు వరుసగా రెండు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. అందులో ఒకటి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ది అయితే.. మరొకటి దర్శకధీరుడు రాజమౌళిది. వీటిలో ప్రస్తుతం అందరి దృష్టిం మహేశ్‌, జక్కన్న సినిమా మీదే పడింది. ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి బిగ్‌ హిట్‌ తర్వాత జక్కన్న రూపొందించబోతున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పరడం సహజమే.

ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేందుకు ఇంకా చాలా సమయమే పడుతుంది..కానీ అప్పుడే పలు పుకార్లు పుట్టుకోస్తున్నాయి. ఈ చిత్రం కోసం జక్కన్నకి మహేశ్‌ ఓ కండీషన్‌ పెట్టాడట. అదేంటంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్‌ వద్దని, టాలీవుడ్ హీరోయిన్ లకే ప్రాధాన్యం ఇవ్వమని మహేశ్‌ చెప్పాడట. గత సినిమాల్లో వరుసగా  బాలీవుడ్ హీరోయిన్ లతో పని చేసిన మహేశ్‌ వాళ్ల తీరుతో విసిగిపోయాడట. వాళ్ల కాల్షీట్ ల ఇబ్బంది, వాళ్ల డిమాండ్స్, వాళ్ల ఫెసిలిటీస్, వాళ్లు పెట్టే షరతులకి విసుగు చెంది మహేశ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే రాజమౌళి సినిమాలో నటించే నటీనటుల వివరాలు వెల్లడించే వరకు ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. మరో విషయం ఏంటంటే.. హీరోయిన్ క్యారెక్టరే కాదు.. ఏ పాత్ర అయినా.. తన ఊహా చిత్రంలో.. కథకు ఎవరు సూట్ అయితే వాళ్లనే తీసుకుంటాడు జక్కన్న. మరి మహేశ్‌ పక్కన,కథకు సరిపడే ఏ హీరోయిన్ ని అనుకుంటున్నాడు అనేది ఇంకా తెలియదు. ఒక వేళ బాలీవుడ్ హీరోయిన్ ను అనుకున్నా..  మరి మహేశ్‌ కోసం కాంప్రమైజ్  అవుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు