సెట్స్‌పైకి వెళ్లిన ‘సర్కారు వారి పాట’, సెట్‌లో మహేశ్‌ సందడి

12 Jul, 2021 18:56 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’ మూవీ నుంచి తాజాగా ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవల దుబాయ్‌లో మొదటి షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో సెకండ్‌ షెడ్యూల్‌ ప్రారంభించి దీని కోసం ప్రత్యేకంగా సెట్‌ను కూడా ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ క్రమంలో కరోనా సెకండ్‌ వేవ్‌లో మూవీ యూనిట్‌ సభ్యులు కొంతమంది కరోనా బారిన పడటంతో షూటింగ్‌ నిలిచింది.

ఇక ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖంగా పట్టడంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ఎత్తివేశారు. ఇక తెలంగాణలో లాక్‌డౌన్‌ తీసేయడమే కాకుండా షూటింగ్స్‌కు కూడా ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. దీంతో స్టార్‌ హీరోలు తిరిగి షూటింగ్‌లో పాల్గొ‍ంటున్నారు. తాజాగా మహేశ్‌ బాబు సైతం సర్కారు వారి పాట షూటింగ్‌లో పాల్గొ‍న్నాడు. ఇవాళ ఈ మూవీ తిరిగి సెట్స్‌పై తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. మహేశ్‌ షూటింగ్‌లో పాల్గొని టీం సభ్యులతో చర్చిస్తున్న ఫొటోను మూవీ యూనిట్‌ షేర్‌ చేసింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు