Sarkaru Vaari Paata: 'మురారి వా' సాంగ్​ చూశారా !

8 Jun, 2022 07:47 IST|Sakshi

Mahesh Babu Sarkaru Vaari Paata Murari Vaa Song Released: సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ. 200 కోట్లకుపైగా వసూళు చేసిన ఈ మూవీకి పరశురామ్​ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆడియెన్స్​ మళ్లీ మళ్లీ చూసేలా, మరింత చేరువయ్యేలా 'మురారి వా' అనే సాంగ్​ను యాడ్​ చేసింది చిత్రబృందం. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ పాటను రిలీజ్​ చేసింది. 

ఈ పాటలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్ కాస్ట్యూమ్స్​, డ్యాన్స్, లొకేషన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మహేశ్​, కీర్తి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. అంతేకాకుండా కీర్తి సురేశ్​ను చాలా గ్లామరస్​గా చూపించారు. ఈ గీతాన్ని అనంత శ్రీరామ్​ రచించగా శ్రుతి రంజని, ఎంఎల్​ గాయత్రి, శ్రీ కృష్ణ ఆలపించారు. ఈ సినిమాకు సంగీతం తమన్​ అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ అమెజాన్​ ప్రైమ్​ వీడియోలో రెంటల్​ పద్ధతిలో స్ట్రీమింగ్​ అవుతోంది. 

చదవండి: 'సర్కారు వారి పాట'పై ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర ట్వీట్‌..

మరిన్ని వార్తలు