ఆయన కళ్లల్లో ప్యాషన్‌ కనిపించింది– అడివి శేష్‌

28 Nov, 2020 05:46 IST|Sakshi

అడివి శేష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మేజర్‌’. ఇందులో శోభితా దూళిపాళ్ల, సయీ మంజ్రేకర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వంలో జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్, సోనీ పిక్చర్స్‌ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతోంది. మేజర్‌ లుక్‌ టెస్ట్‌ వీడియోను హీరో మహేశ్‌బాబు విడుదల చేశారు. ‘మేజర్‌’ విశేషాలను అడివి శేష్‌ ఆ వీడియోలో వెల్లడిస్తూ– ‘‘మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ 2008 నుంచి నా మైండ్‌లో ఉన్నారు.

26/11 ముంబై టెర్రర్‌ దాడి జరిగినప్పుడు అమెరికాలో ఉన్నాను. ఆ దాడిలో సందీప్‌ మరణించినట్లు అక్కడి న్యూస్‌ ఛానల్స్‌లో 27వ తేదీ ఆయన ఫోటో వేశారు. ఆయన కళ్లల్లో ఒక ప్యాషన్, స్పిరిట్‌ కనిపించింది. దాంతో ఆయన ఎవరో తెలుసుకోవాలని ఆయనపై వచ్చిన ప్రతీ న్యూస్‌ను కట్‌ చేసి పెట్టుకున్నాను. ఆయన ఇంటర్వ్యూలు చూశాను. ‘మేజర్‌’ లాంటి ప్యాన్‌ ఇండియన్‌ స్టోరీ చెప్పగలననే నమ్మకం వచ్చాక  సందీప్‌ పేరెంట్స్‌ని కలిశాను. ఆ తర్వాతే ఈ సినిమా మొదలు పెట్టాం. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను డిసెంబర్‌ 17న రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు