Mahesh Babu Daughter Sitara: కూతురికి సూపర్ స్టార్ మహేశ్ బాబు​ స్పెషల్ విషెష్.

25 Sep, 2022 20:01 IST|Sakshi

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన గారాలపట్టి సితారపై మరోసారి ప్రేమను చాటుకున్నారు. ఇంటర్నేషనల్ డాటర్స్‌ డే సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. తన కుమార్తె సితారకు డాటర్స్ డే  శుభాకాంక్షలు చెబుతూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇద్దరు కలిసి ఉన్న పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.  'నా ప్రపంచాన్ని ఎల్లప్పుడూ ప్రకాశవంతం చేసే నా చిన్నారికి డాటర్స్ ​డే శుభాకాంక్షలు" అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. తరచుగా మహేశ్​, సితారతో కలిసి సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. కొద్దిరోజులుగా పలు టీవీ షోలకు సైతం ఇద్దరూ కలిసి వెళ్తున్నారు.

(చదవండి: మార్షల్ ఆర్ట్స్‌ నేర్చుకుంటున్న కాజల్ అగర్వాల్.. ఆ సినిమా కోసమే..!)


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పూజా హెగ్డే కథానాయిక గా నటిస్తోంది.  ఈ చిత్రానికి తాత్కాలికంగా 'SSMB28' అని పేరు పెట్టారు. ఈ సినిమాలో బింబిసార ఫేమ్ సంయుక్త మీనన్ నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ 2023 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

మరిన్ని వార్తలు