సీక్వెల్స్‌ ఉన్నాయి!

3 Jan, 2023 04:13 IST|Sakshi

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు. ఇప్పటికే ఇది ‘యాక్షన్‌ అడ్వంచరస్‌’ మూవీ అని ఆయన పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రానికి సీక్వెల్స్‌ ఉంటాయన్నారు.

ప్రధానపాత్రలు అలాగే ఉంటాయని, సీక్వెల్స్‌ కథ మారుతుంటుందని స్పష్టం చేశారాయన. ప్రస్తుతం తొలి భాగానికి సంబంధించిన కథను పూర్తి చేసే పని మీద ఉన్నారు విజయేంద్రప్రసాద్‌. ఇక మహేశ్‌ అద్భుత నటుడని, యాక్షన్‌ సీన్స్‌ బాగా చేస్తారని, ఏ రచయితకైనా ఆయనకు రాయడం బాగుంటుందని, ఈ చిత్రానికి హీరోగా తనే బెస్ట్‌ చాయిస్‌ అని చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్‌. ఈ ఏడాది ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు