అన్ని జీవజాతుల్ని సమానంగా చూడాలి

10 Aug, 2020 02:41 IST|Sakshi
మొక్కలు నాటుతూ... మహేశ్‌బాబు

మెడపై రూపాయి కాయిన్‌ ట్యాటూ, చేతికి కట్టుకున్న తాడులో ఓమ్‌ లాకెట్, ఇయర్‌ రింగ్‌.. ఇలా ‘సర్కారువారి పాట’లో మహేశ్‌బాబు చాలా స్టయిలిష్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ఆదివారం ఆయన బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన సినిమా మోషన్‌ పోస్టర్‌ టీజర్‌ అంచనాలు పెంచే విధంగా ఉంది. పరశురామ్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీస్, 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, జి. మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై లిమిటెడ్‌ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతోంది.

తన పుట్టినరోజుని  పురస్కరించుకుని గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో మహేశ్‌బాబు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకు ఎంత ఉందో మొక్కలకీ, జంతువులకీ అంతే ఉంది. అన్ని జీవజాతుల్ని సమానంగా చూడటమే నాగరికత. అభివృద్ధి అంటే మనుషులతో పాటు వృక్షాల ఎదుగుదల కూడా. అందుకే జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా కార్యక్రమంలో అందరూ భాగమవ్వాలి’’ అన్నారు. అలాVó యన్టీఆర్, విజయ్, శ్రుతీహాసన్‌లకు గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ను విసిరారు మహేశ్‌బాబు.

మరిన్ని వార్తలు