లేటెస్ట్ ట్రెండ్.. స్టేజ్‌పై స్టార్‌ హీరోల స్టెప్పులు

11 Jun, 2022 17:16 IST|Sakshi

ఒకప్పుడు హీరోలు స్టేజ్‌పై తమ సినిమాలోని డైలాగ్స్‌ చెపి అభిమానులను ఖుషీ చేసేశారు. కానీ ఇప్పుడు హీరోలు అదే స్టేజ్‌పై స్టెప్పులేయడం ట్రెండ్‌గా మారింది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ లో మైక్ పట్టుకుని అభిమానులను ఉద్దేశించి మాట్లాడాల్సిన హీరోలు అంతటితో ఆగకుండా అదే స్టేట్ పై స్టెప్పులేస్తూ ఈవెంట్ వచ్చిన ఆడియెన్స్ ను ఉర్రూతలూగిస్తున్నారు. సినిమా సక్సెస్ ను అందరితో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవల సర్కారు వారు పాట ప్రమోషన్స్ లో సూపర్‌ స్టార్‌​ మహేశ్‌ బాబు స్టేజ్‌పై స్టెప్పులేసి టోటల్‌ టాలీవుడ్‌ను ఆశ్చర్యపరిచాడు.

(చదవండి: వేదికపై మహేష్‌బాబు డ్యాన్స్‌)

అలాగే ఎఫ్‌3 సక్సెస్‌ మీట్‌లో విక్టరీ వెంకటేష్‌ కూడా స్టేస్‌పై డాన్స్‌ చేశారు.తాజాగా  అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని, నజ్రియా మాత్రమే కాకుండా టోటల్ యూనిట్ ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ కు స్టెప్పులేసింది.

కరోనా కాలంలో థియేటర్స్‌కి ప్రేక్షకులను రప్పించడం కోసమే హీరోలో ఇలా డాన్స్‌ చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అని ఇటీవల అల్లు అరవింద్‌ అన్నారు. .ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించేందుకు ఇండస్ట్రీకి కొన్ని సూచనలు కూడా చేశారు. వాటిల్లో హీరోలు సీరియస్ గా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టాలని చెప్పారు.

మరిన్ని వార్తలు