మహేష్‌బాబుకు ఈరోజు చాలా స్పెషల్‌.. ఎందుకో తెలుసా?

20 Apr, 2021 14:55 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుకు ఫ్యామెలీ మెన్‌ అన్న సంగతి తెలిసిందే. ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతో గడపడానికే ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ఆయన పరుశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారువారిపాట సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా తొలిసారిగా కీర్తి సురేష్‌ నటిస్తుంది. కరోనా కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడింది.

ఇక ఏప్రిల్‌ 20 మహేష్‌బాబుకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే మహేష్‌ తల్లి ఇందిరా దేవీ పుట్టినరోజు నేడు( మంగళవారం). దీంతో తల్లితో కలిసి దిగిన ఫోటోను మహేష్‌బాబు షేర్‌ చేస్తూ బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఇక మహేష్‌ సోదరి మంజులా సైతం తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'తన నవ్వులానే తన వ్యక్తిత్వం కూడా ఎంతో స్వచ్చమైనది. మా జీవితంలోని ప్రతీ రోజును గొప్పగా తీర్చదిద్దావు. మన కుటుంబానికి నువ్వే వెన్నముక..లవ్‌ యూ అమ్మ..హ్యపీ బర్త్ డే అమ్మ' అంటూ మంజులా ట్వీట్ చేసింది. 

చదవండి : హీరోయిన్‌ అంజలా జవేరీ భర్త 'విలన్'‌ అని మీకు తెలుసా?
ఈ జీవితానికి ఇంకేం కావాలి: మంగ్లీ భావోద్వేగం

మరిన్ని వార్తలు