టాలెంటెడ్‌ అంటూ కీర్తికి మహేష్‌ బర్త్‌డే విషెస్‌!

17 Oct, 2020 10:41 IST|Sakshi

మహానటితో తన సత్తా చాటి జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు పొందింది కీర్తి సురేష్‌. ఈ రోజు కీర్తి పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్‌ ప్రముఖులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా సూపర్ ‌స్టార్‌ మహేష్‌ బాబు కీర్తికి ట్విట్టర్‌ ద్వారా బర్త్‌డే విషెస్‌ చెప్పారు. మహేష్‌ బాబు నటిస్తున్న ‘సర్కార్‌  వారి పాట’ చిత్రంలో కీర్తి నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా ‘టాలెంటెడ్‌ కీర్తి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సర్కార్‌ వారి పాట’ టీం మీకు ఫారెన్‌ వెళ్లడానికి స్వాగతం పలుకుతోంది. కచ్ఛితంగా ఈ సినిమా మీ జీవితంలో ఒక మంచి గుర్తుగా మిగిలిపోతుంది’ అని మహేష్‌ బాబు ట్వీట్‌ చేశారు. 

చదవండి: మిస్ట‌రీ: అప్పుడు క‌ట్ట‌ప్ప‌, ఇప్పుడు సీత‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు