మాస్‌ డైరెక్టర్‌ బర్త్‌డే; మహేష్‌ విషెస్

28 Sep, 2020 16:49 IST|Sakshi

డేరింగ్‌& డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ ఎందరో హీరోలకు కెరీర్‌లో నిలిచిపోయే పాత్రలు సృష్టించి వారికి మంచి పేరును అందించారు. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హిరోలందరితో వర్క్ చేశారు ఆయన. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు గెచ్చుకున్నారు. సోమవారం పూరి జగన్నాథ్‌ తన 54వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ శుభ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు బర్త్‌డే విషెస్‌ తెలుతున్నారు. ఈ క్రమంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు డైరెక్టర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా ఫేవరేట్‌ డైరెక్టర్‌ పూరి జగనాథ్‌కు పుట్టిన రోజు శుబాకాంక్షలు, మీరెప్పుడూ సంతోషంగా ఉంటూ, ఇంకా మరెన్నో విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను’. అని ట్వీట్‌ చేశారు. (నాగ్‌తో మూడోసారి?)

పోకిరి, బిజినెస్‌మెన్‌ వంటి రెండు సుపర్‌ హిట్‌ చిత్రాలను అందించి సుపర్‌స్టార్‌ మహేష్‌ రేంజ్‌ను పెంచారు. అలాగే హీరో రామ్‌ చరణ్‌ కూడా ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. చిరుత సినిమాతో రామ్‌ చరణ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది పూరీనే. అర్జున్‌ రెడ్డి హీరో విజయ్‌ దేవరకొండ. దర్శకుడు సురేందర్‌, రఘు కుంచె, అనిల్‌రావిఫూడి, నాగబాబు, బీఏ రాజు, నభా నటేష్‌ సహా పలువురు శుబాకాంక్షలు తెలిపారు. ఇక చివరగా ఇస్మార్ట్ శంక‌ర్‌తో భారీ హిట్ కొట్టిన పూరీ జ‌గ‌న్నాథ్ ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అనన్య పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో పాన్‌ ఇండియ చిత్రం ‘ఫైట‌ర్’ చేస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. (డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఆగలేదు)

పూరి మరో చిత్రం ‘‘జనగణమన’ తన నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని పేర్కొన్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్, హీరో మహేశ్‌బాబుల కాంబినేషన్‌లో ‘జనగణమన’ అనే చిత్రం రూపొందనుందని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రాన్ని స్వయంగా పూరీయే ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందనే టాక్‌ వినిపించింది. ‘‘జనగణమన’ చిత్రం ఆగిపోలేదు. ఇది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌’’ అని తాజాగా పూరి జగన్నాథ్‌ పేర్కొనడంతో ఈ చిత్రం గురించి మళ్లీ హైప్‌పెరిగింది. (నా లైఫ్‌లైన్‌ రా నువ్వు..)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా