పాన్‌ ఇండియా సినిమాలు ...ఆ రోజు ఫ్యాన్స్ కి పండగే!

16 Mar, 2023 13:48 IST|Sakshi

ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్‌ ఇండియా సినిమాలు ఓ రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. ఇక ఆ సినిమాల అప్డేట్స్ కోసం మూవీ లవర్స్ తో పాటు...స్టార్ హీరోల అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాలు అంటే వాళ్ల బర్త్‌డే కి మాత్రమే కాకుండా ఫెస్టివల్ కి కూడా  ఏదొక అప్డేట్ ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. అలాగే ఈ ఉగాదికి టాలీవుడ్ నుంచి చాలా సినిమా అప్డేట్స్ రాబోతున్నాయి. 

మహేశ్‌ బాబు -త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ #ssmb28. అతడు, ఖలేజా తర్వాత ఈ కాంబినేషనల్ రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీ భారీ అంచనాలే  ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఏప్రిల్ నెలాఖారు కల్లా సాంగ్స్ , ఒక ఫైట్ మినహా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేలా డైరెక్టర్ త్రివిక్రమ్‌ షెడ్యూల్ ప్లాన్ చేశాడు.

ఈ సినిమా రీస్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్డేట్ కోసం మహేశ్‌ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ లో ఈ మూవీ కి టైటిల్ ఏమి పెడతారనే విషయం పై చాలా ఇంట్రెస్ట్‌ గా ఉన్నారు. ఉగాది నాడు ఈ సినిమా టైటిల్ ప్రకటనతో పాటు మహేశ్‌ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.  ఇప్పటికే ఈ మూవీని నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మార్చి 22న ఖచ్చితంగా  అప్డేట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు

ఇక నందమూరి బాలకృష్ణ అభిమానులు కూడా #NBK108  అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటిస్తోంది.  ఇక ఉగాది నాడు ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్లు ఓ పవర్‌ఫుల్‌ టైటిల్ ఫిక్స్ చేశారనే మాట టీటౌన్ లో వినిపిస్తోంది. 

వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న అఖిల్ మూవీ ఏజెంట్. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న అఖిల్ మూవీ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఇక ఏప్రిల్ 28న రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఏజెంట్ మూవీకి సంబంధించి ఇప్పటికే టీజర్ సాంగ్స్ విడుదల చేశారు. ఇక ఉగాది నాడు అక్కినేని సర్‌ప్రైజ్‌ ఇచ్చే విధంగా ఏజెంట్ మూవీ నుంచి ఓ అప్డేట్ ఉంటుందనే ప్రచారం ఫిల్మ్‌ సర్కిల్స్ లో సాగుతోంది. 

గ్లోబల్ ఇమేజ్ అందుకున్న ప్రభాస్ బాలీవుడ్ లో నటించిన డెబ్యూ మూవీ ఆదిపురుష్‌. జూన్ 16న విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించి...ఓ క్రేజీ అప్డేట్‌ ఉగాది రోజు రానుందట. ఆదిపురుష్‌ మైథిలాజికల్ ఫిల్మ్‌ కాబట్టి ఉగాది నాడు ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునే విధంగా డైరెక్టర్ ఓంరౌత్ టీమ్ ప్లాన్ చేస్తుందట. 

అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్‌ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్.సి.15. మార్చి 27న రామ్ చరణ్‌ బర్త్‌ డే ఉంది. కాబట్టి ఉగాది నాడు ఆర్.సి.15 టైటిల్ అనౌన్స్ చేసి...బర్త్‌డే రోజు టీజర్ రిలీజ్ చేసేందుకు డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. 

అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా బోళా శంకర్...శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం కూడా మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ మెహర్ రమేష్‌ ఉగాది రోజు మెగా ట్రీట్ ఖచ్చితంగా ఇస్తాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.  సో...ఉగాది నాడు సినీ అభిమానులను ఏ మూవీ అప్డేట్స్ పలకరిస్తాయో చూడాలి మరి.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు