నటి ఆరోపణలు.. ఖండించిన దర్శకుడు

24 Oct, 2020 16:30 IST|Sakshi

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు మహేష్‌ భట్‌, ఆయన కుటుంబం తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు నటి లువైనా లోధ్‌ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లువినా ఆరోపణలను ఖండిస్తూ మహేష్‌ భట్‌ న్యాయవాది శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ప్రకటనలో పేర్కొన్నారు. ‘లువైనా లోధ్‌ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి మాత్రమే కాదు పరువు నష్టం​ కలిగించేలా ఉన్నాయి. తను విడుదల చేసిన వీడియో చట్ట పరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది. ఈ ఆరోపణలను మా క్లైయింట్‌ మహేష్‌ భట్‌ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన విడుదల చేశారు. (చదవండి: పర్వీన్‌ కోసం వాళ్లను కాదనుకున్నాడు)

A post shared by Vishesh Films (@visheshfilms) on

మహేష్‌ భట్‌, ఆయన కుటుంబ సభ్యులు తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల లువైనా లోధ్ వీడియో పోస్టు చేశారు. 1 నిమిషం 48 సెకన్‌ల నిడివి గల ఈ వీడియోలో తనను తాను పరిచయం చేసుకుని ఆ తర్వాత తను, తన కుటుంబ భద్రత ​కోసమే ఈ వీడియో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా తాను మహేష్‌ భట్‌ మేనల్లుడు సుమిత్‌ సబర్వాల్‌ను వివాహం చేసుకున్నట్లు కూడా వెల్లడించారు. (చదవండి: ప్ర‌పంచ రికార్డు కొట్టేసిన స‌డ‌క్ 2)

I m being harrased by Mahesh Bhatt & family. Pls support.

A post shared by Actor | Luviena Lodh (@luvienalodh) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా