Tammareddy Bharadwaja: మేజర్‌.. పాన్‌ ఇండియా చిత్రాలకు ఏమాత్రం తీసిపోదు.. కానీ!

11 Jun, 2022 14:16 IST|Sakshi

Tammareddy Bharadwaja Shocking Comments On Pan India Movies: అడివి శేష్‌ నటించిన మేజర్‌ మూవీపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌ ప్రశంసలు కురిపించాడు. మేజర్‌ సినిమా చూసిన ఆయన ఓ వీడియో విడుదల చేశాడు. ‘‘నిన్ననే మేజర్‌ సినిమా చూశాను. సినిమా చాలా బాగా తీశారు. నటీనటులందరూ చక్కగా నటించారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు’ అని చెప్పుకొచ్చారు. అనంతరం పాన్‌ ఇండియా చిత్రాలపై స్పందించారు.  

‘‘ఈ మధ్య మనం ఎక్కువగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌, పాన్‌ ఇండియా సినిమా అని చెబుతున్నాం. నిజంగా చెప్పాలంటే మేజర్‌ పాన్‌ ఇండియా కథ. అయితే కొంతమంది ‘మాది పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌. బడ్జెట్‌ భారీగా అయ్యింది, లాస్‌లు వస్తున్నాయి కాబట్టి మేము సినిమా టికెట్‌ రేట్లు పెంచుకునేలా అవకాశం కల్పించండి’ అని ముఖ్యమంత్రులను కోరారు. అలాంటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లకు మేజర్‌ సినిమా ఏమాత్రం తీసిపోదు.

చదవండి: పక్షవాతం బారిన స్టార్‌ సింగర్‌.., లైవ్‌ వీడియో వైరల్‌

టెక్నికల్‌, క్వాలిటీపరంగా సినిమా చాలా బాగుంది. ఈ చిత్రాన్ని కేవలం రూ. 25 కోట్లలోపే పూర్తి చేశారు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసి మంచి విజయం సాధించారు. మరి మిగిలిన ప్రాజెక్ట్‌లకు ఎందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మేజర్‌ లాంటి చిత్రానికి ఖర్చు అవ్వలేదు మీకు ఎందుకు అవుతుంది? నిర్మాతలు, హీరోలు ఆలోచించాలి. షూటింగ్‌ అని చెప్పి క్యారవాన్‌లో కూర్చుంటున్నారా? సినిమా చేస్తే ప్యాషన్‌తో చేయాలి. సమయాన్ని వేస్ట్ చేసి డబ్బులని వృథా చేస్తున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

చదవండి: Vignesh Shivan-Nayanthara: ‘ఆ కంగారులో చూసుకోలేదు క్షమించండి’

మరిన్ని వార్తలు